ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలకు క్షీరాభిషేకం

జైపూర్/చెన్నూర్, వెలుగు:​ భీమారం–చెన్నూరు మండలాల సరిహద్దులోని నేషనల్​ హైవే 63 రహదారిలో బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫోటోలకు కాంగ్రెస్​లీడర్లు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. శనివారం జోడువాగుల బ్రిడ్జి ప్రాంతంలో చెన్నూర్, భీమారం, కోటపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ ​లీడర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వివేక్​తోపాటు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూపుతున్న చొరవకు ప్రజలు రుణపడి ఉంటారన్నారు.

అధ్వాన్నంగా మారిన నేషనల్​ హైవే 63 రహదారిపై ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడినా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్​ సర్కార్​ వచ్చిన ఏడాది కాలంలోనే ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి నాలుగు కిలోమీటర్ల పొడవున కొత్తగా బీటీ రోడ్డుకు ఫండ్స్​ మంజూరు చేయించారని, ఫలితంగా ప్రయాణికులు, వాహదారుల కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ లీడర్లు మూల రాజిరెడ్డి, చెన్న సూర్యనారాయణ, గజ్జెల అంకాగౌడ్, మహేశ్​తివారీ, సత్యనారాయణ గౌడ్, సుశీల్ ​కుమార్, చింతల శ్రీనివాస్, పాతార్ల నాగరాజు, పోగుల సతీశ్, విజయ్, మల్లక్క, ఖలీల్, ప్రవీణ్​ నాయక్, అన్వర్, తిరుపతి, కమలాకర్, మధుకర్​ తదితరులు పాల్గొన్నారు.